Thursday, March 31, 2011

‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ యువరాజ్

ప్రపంచకప్ ప్రారంభానికి ముందు వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలెదుర్కోవడంతోపాటు జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం చేసుకున్న యువరాజ్‌సింగ్ ప్రపంచకప్ టోర్నీలో తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్ జైత్రయాత్రలో కీలక భూమిక పోషిస్తూ మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తున్నాడు. ఒకప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా గుర్తింపు పొందిన యువరాజ్ ఆ తరువాత కెప్టెన్సీపై మోజుతో తన అసలు బాధ్యతలను మరచిపోయాడు. తనకన్నా వెనక జట్టులోకి వచ్చిన ధోనీకి నాయకత్వం ఇవ్వడమేమిటనే దుగ్ధ అతని ఏకాగ్రతను దెబ్బతీసింది. చివరికి జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే పరిస్థితి వచ్చాకగాని.. యువరాజ్‌కు తత్త్వం బోధపడలేదు. తిరిగి వాస్తవ ప్రపంచంలోకి వచ్చి తాను పోషించాల్సిన పాత్రపై దృష్టి నిలుపుతున్నాడు. ఫలితమే ప్రపంచకప్ టోర్నీలో తన సత్తాను పూర్తిస్థాయిలో ప్రదర్శించగలుగుతున్నాడు. అంతేకాదు.. తీవ్ర ఒత్తిడిలోనూ పరిణతి చెందిన ఆటతీరుతో ఒంటిచేత్తో జట్టుకు విజయాలందిస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై చూపిన తెగువే అందుకు నిదర్శనం. పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో దురదృష్టవశాత్తూ తొలిబంతికే ఔటయ్యాడు. లేదంటే పాక్ బౌలర్లు యువరాజ్ విశ్వరూపమే చూడాల్సి వచ్చేది. టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రతిభతో 341 పరుగులు, 12 వికెట్లు తీసిన యువీ.. నాలుగు సార్లు  ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్నాడు. శ్రీలంకతో జరిగే ఫైనల్‌లో భారత్ విజయం సాధించి ప్రపంచకప్ సాధిస్తే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గానూ యువరాజ్ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ప్రపంచకప్ తరువాత కూడా యువరాజ్ ఇదే క్రమశిక్షణతో ఉండి తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌కు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుందాం.

Wednesday, March 30, 2011

shyamkancharla: all the best my friends!

shyamkancharla: all the best my friends!: "all the best my friends!"
all the best my friends!

shyamkancharla: వైఎస్ వివేకానందరెడ్డి రాజీనామా చేశారట!

shyamkancharla: వైఎస్ వివేకానందరెడ్డి రాజీనామా చేశారట!: "వైఎస్ వివేకానందరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారట. ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తయినందునే రాజీనామా చేస్తున్నానని, రాజ్యాంగం ప్రకారం మరో ఆరు నె..."

వైఎస్ వివేకానందరెడ్డి రాజీనామా చేశారట!

వైఎస్ వివేకానందరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారట. ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తయినందునే రాజీనామా చేస్తున్నానని, రాజ్యాంగం ప్రకారం మరో ఆరు నెలలు మంత్రిగా కొనసాగే అవకాశం ఉన్నా నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తన రాజీనామాను ఆమోదించే విషయంలో తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రిదేనని, పార్టీ ఆదేశిస్తే కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో దేనికైనా పోటీకి సిద్ధమని కూడా ప్రకటించారు. ఇంతకూ ఆ ఎన్నికల్లో పోటీ చేస్తాననేది కాంగ్రెస్ అభ్యర్థిగా తాను గెలిచేందుకా.. లేక టికెట్ ఇతరులకు దక్కితే జగన్ గెలుపు కష్టమవుతుందనే ఉద్దేశంతోనా..? అన్నదే అందరిలోనూ రేకెత్తుతున్న ప్రశ్న. అటువంటి ఆలోచనే లేకపోతే తన పదవీకాలం ముగిసిపోనుందని తెలిసి కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా సైలెంట్‌గా ఎందుకున్నట్టు?  రోజుల వ్యవధిలోనే ముగిసిపోయే తన ఎమ్మెల్సీ పదవికి ముందే రాజీనామా చేసి కడప స్థానానికి స్థానిక అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో దిగి గెలవచ్చుగా! అలా చేయకుండా జగన్ వర్గం అభ్యర్థి గెలుపునకు సహకరించి కాంగ్రెస్‌ను దెబ్బతీసే చర్యల్లో పాలుపంచుకున్నాడు. పైగా ఎవరికీ అనుమానం రాకుండా జగన్ మీడియాలో తనపై వ్యతిరేక కథనాలు వచ్చేలా చూసుకున్నాడు. కాంగ్రెస్ నుంచి జగన్ బయటికి వెళ్లి వ్యూహాత్మకంగా తన బాబాయిని మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంచి ‘అవసరమైనప్పుడు’ కాంగ్రెస్ నుంచి ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడ్డాడు. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా ఈ బాబాయి-అబ్బాయిల వ్యవహారంపై జాగ్రత్త వహిస్తే మంచిది. లేదంటే మరోసారి ‘స్థానిక ఎమ్మెల్సీ’ ఎన్నికల్లో మాదిరిగానే అవకాశవాదుల చేతిలో మోసపోక తప్పదు. 

Monday, March 28, 2011

shyamkancharla: నిండు అసెంబ్లీలో ఒక మంత్రి విచక్షణ కోల్పోయి సహచర స...

shyamkancharla: నిండు అసెంబ్లీలో ఒక మంత్రి విచక్షణ కోల్పోయి సహచర స...: "నిండు అసెంబ్లీలో ఒక మంత్రి విచక్షణ కోల్పోయి సహచర సభ్యులపై దాడి చేస్తే.. అతని తరపున ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పడం ఎంత విడ్డూరం.! తన చర్య పట్ల..."
నిండు అసెంబ్లీలో ఒక మంత్రి విచక్షణ కోల్పోయి సహచర సభ్యులపై దాడి చేస్తే.. అతని తరపున ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పడం ఎంత విడ్డూరం.! తన చర్య పట్ల కనీసం ఆ మంత్రికి పశ్చాత్తాపం కూడా లేకపోవడం బాధాకరం.